పరిశుద్ధాత్ముడు


పరిశుద్ధాత్ముడు

పరిశుద్ధాత్ముడు విభిన్న నామములతో పరిశుద్ధగ్రంథములో పిలువబడెను. "దేవుని ఆత్మ" (ఆది 1:2), "సత్యస్వరూపియగు ఆత్మ" (యోహాను 14:16), "పరిశుద్ధాత్ముడు" (లూకా 11:13), "పరిశుద్ధమయిన ఆత్మ" (రోమా 1:4), మరియు "ఆదరణకర్త" (యోహాను 14:26). పరిశుద్ధాత్మడు సమస్తమునకు సృష్టికర్త మరియు జీవముదయచేయువాడు (యోబు 33:4; కీర్తన 104:30). లేఖనములు వ్రాయుటకు ఆయన ప్రేరేపితము చేసినవాడు (2పేతురు 1:21). ఈయన ద్వారా దేవుడు అద్భుత వరములను ఆయన ఆత్మీయ విషయములను అర్ఠముచేసుకొను సామర్థ్యము దయచేయువాడు (యోబు 32:8; యెష 11:2). ఆయన దేవుని పరిచారకులను అభిషేకించి వారిని పరిశుద్ధపరచి, పరిచర్యయందు జతపరిచెను (అపో 10:38; 1యోహాను 2:27). ఆయన యేసుక్రీస్తు యొక్క గొప్ప సాక్షి. మరియు పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఓప్పింపకొనజేయును (యోహాను 15:26; 16:8). ఆయన శిష్యులలో నివాసము చేసి వారికి శక్తిని అనుగ్రహించి యేసుక్రీస్తు సాక్షులనుగా ప్రపంచ వ్యాప్తముగా వాడుకొనెను (అపో 1:8).


© డామినిక్ మార్బానియంగ్, 2009

భాషాంతరము: బాలరాజు కే.


English

हिन्‍दी 

Khasi

 

Make a Free Website with Yola.