దయ్యములు


దయ్యములు

దయ్యములు దేవదూతలే. వేరు లూసిఫర్తో కలిసి దేవునికి వ్యతిరేఖముగా తిరుగు బాటు చేసిన వారు. లూసిఫర్ ను సాతాను అని కూడా పిలువబడ్డాడు (అర్థము "శత్రువు"), షుటస్ర్పము, శోధకుడు, దుష్టుడు, ఈ లోఖాధికారి, ఈయుగ సంబంధమయిన దేవత, నరహంతకుడు, అబద్ధమునకు జనకుడు (యెష 14:12-15; యెహె 28:12-19; యోహాను 12:31; 2కొరిం 4:4; మత్తయి 4:3; 1యోహాను 5:19; యోహాను 8:44). అదే విధముగా ఈదుష్టాత్మలను "తమ ప్రధానత్వమును నిలుపుకొనని దూతలుగా ఎంచబడెను (యూదా 6). వీరు పడిపోయిన దేవదూతలు. వీరు దేవుని పరిచర్యను అభ్యంతర పరుచువారు (1థెస్స 2:18), దేశములను మోసపుచ్చువారు (ప్రకట 20:7-8), గ్ర్వామ్ధుడ్యిన అపవాధి (1తిమొతి 3:6), అవిధేయులైన వారిని ప్రేరేపిమ్చు శక్తి కలిగిన వారు (ఎఫె 2:2), కఠిన స్వభావము కలినినవి (1పేతురు 5:8), అపాయము కలుగచేయువారు (యోబు 2:4), నానా ప్రఖరములుగా మానవులను పీడించువారు (అపో 10:38; మార్కు 9:25). వీరు అవిశ్వాసుల శరీరములను ఆవరించువారు (మత్తయి 8:16), మనుష్యునిలోనికి ప్రవేశించు సామర్థ్యముగలవారు (లూకా 22:3), హృదయములను ప్రేరేపించువారు (అపో 5:3), పశువులను కూడా ఆవరించువారు (లూకా 8:33).

విశ్వాసులు దయ్యములు పట్టిపీడింపబడరు, వారి దేహము పరిశుద్ధాత్మ ఆలయము. దయ్యములదు స్థలముండదు (1కొరిం 6:19; 10:21).

దయ్యములు దేవునిని నమ్మి వణుకుచున్నవి (యాకోబు 2:19). సాతాను, దయ్యములు దేవుని తీర్పుకై వేచియున్నవి (మత్తయి 8:29; ప్రకట 20:10). యేసుక్రీస్తు నంద్య్ విశ్వాసము కలిగిపిలువబడిన వారు దేవునికి విధేయులై అపవాధిని ఎదురించుదురు (యాకోబు 4:7). విశ్వాసుల సూచన్లు ఏవిటంతే వారు దయ్యములను వెల్లగొట్టుదురు (మార్కు 16:17).


దయ్యములను వెడలిగొట్టుట

క్రీస్తు యిచ్చిన అధికారముతో విశ్వసులు దయాములను వెల్లగట్టుదురు (మత్తయి 10:1,8; మార్కు 16:17). ఈ శక్తికి మూల కారణము క్రీస్తు మాత్రమే.

క్రీస్తు దేవుని ఆత్మవలన వాటిని వెల్లగొట్టెను (మత్తయి 12:28), కాబట్టి విశ్అసి ఆత్మచే నింపబడిన నడ్వడికను కలిగి ఉండవలెను (గలతి 5:25).

ప్రార్థన, ఉపవాసము దేవునికి సంపూర్తి సమర్పణ ప్రాముఖ్యము (మార్కు 9:29; యాకోబు 4:7).

విశ్వాసులు ఆత్మలవివేచన వరమును వెదకు వైయుండవలెను (1కొరిం 12:10).

దయ్యముతో మాట్లాడ్రాదు (మార్కు 1:24). వారు మోసముచేయువారు.

విశ్వాసులు వాటిని యేసు నామములో వెల్లగొట్టవలెను (అపో 16:18)

దయ్యములను వెల్లగొట్టునపుడు కళ్ళుమూయరాదు: నీవు ఆఙ్ఞాపించుచున్నావు, ప్రార్థన చేయడం లేదు; దయ్యములు కొన్ని పర్యాయములు శరీర్కముగా గాయపర్చును (మత్త 17:15; అపో 19:15-16).

దేవుని యందు విశ్వాసము, ఆయన వాక్యము క్రీస్తుయొక్క శక్తి, మరియు పరిశుద్ధాత్మయందు బలహీన పర్చడనికి విశ్వాసి సాతానుకు ఏమాత్రము అవకాశమునివ్వరాదు. అనుమానము సాతానుయొక్క ఆయుధం (ఆది 3:1; మత్తయి 4:3-10).

దయ్యములను వెడలిగొట్తునపుడు దైవసేవకుల మధ్య క్రమము పద్ధతి ప్రకారము కలిగి ఉండాలి, ఒక సేవకుడు అధికార సేవ వహిస్తున్నగా మిగతా వారు ప్రార్థనలో ఉండలి (1కొరి 14:33).

మంత్రములతో చేయబడిన తామత్తు, దారము మొదలగునవి దయ్యములను వెడలిగొట్టకు మునుపు తీసివేయవలెను. ఇటువంటివి దెయ్యాలకు అవసరము ఇచ్చెను (అపో 19:19).

తిరిగి వదిలిన అపవాది రాకుండునట్లు విడుదల కలిగిన వారిని తప్పక ఒప్పుకొనుటకు, మారుమనస్సు, విశ్వాసమునకు మరియు పరిశుద్ధాత్మ నింపబడుటకు నడిపించవలెను (మత్తయి 12:44-45). పరిశుద్ధ జేవితము మరియు దేవుని చిత్తప్రకారము నడుచుకొనుట ప్రాముఖ్యము (1యోహాను 5:18).


© డామినిక్ మార్బానియంగ్, 2009

భాషాంతరము: బాలరాజు కే.


English

हिन्‍दी 

Khasi

 

Make a Free Website with Yola.