తీర్పు


తీర్పు

దేవుని యొదుటకు ప్రతివారు తీర్పుతీర్చబడుటకు ప్రపంచ చివరి దినమున తేబదురు. యేసు ముందుగానే చివరిదినము గూర్చిన సూచనలు ఇచ్చెను. అవి విశ్వసములో పడెపోవువారు, అబద్ధ ప్రవక్తలు, ప్రపంచమును ఆధినములో ఉంచుకొను రాబోవు అబద్ధ క్రీస్తు, మరియు యుద్ధములు, భూకంపములు, క్రువులు, దుష్ఠకార్యముల పెరుగుదల, దుర్భోధల మరియు అనేక సూచనలు (మత్తయి 24) జరుగును. వీటన్నింటి తరువాత మనుష్యకుమారుడు మహిమప్రభావముతో ఆకశమునందు దూతలతో అగుపించును (2థెస్స 1:7) . ఆయన రెండవ మారు తన ప్రజల రక్షణార్థమై మరియు లోకమునకు తీర్పు తీర్చుటకు కనిపించును (హెబ్రి 9:28). క్రీస్తు నందు నిద్రించిన వారు మొదట లేతురు, తదుపరి సజీవులైన ఆయన శిష్యగణం ప్రభువుతో యుగయుగములుండుటకు ఎత్తబడుదురు (1థెస్స 4:16-17). సాతాను వాని అనుచరగణం నరకమునందు శిక్షింపబడుదురు (మత్త 25:4; ప్రకటన 20:10). జీవ గ్రంథమందు పేరు వ్రాయబడ్ని వారు అగ్నిగుండము నందు పడద్రోయబడుదురు (ప్రకటన 20:15) ఎందుకంటే కార్యములను బట్టి వారికి తీర్పు తీర్చబడును (రోమా 2:5-6; యూదా 15).



© డామినిక్ మార్బానియంగ్, 2009

భాషాంతరము: బాలరాజు కే.


English

हिन्‍दी 

Khasi

  

Make a Free Website with Yola.