పరిశుద్ధగ్రంథ సత్యాలు: దేవుడు


దేవుడు ఎవరు?

పరిశుద్ధ గ్రంథము మనకు దేవుడు విశ్వసృష్టికర్తయైయున్నడని బోదించుచున్నది (ఆది:1:1). సృష్టి కర్తగా, ఆయన సృష్టిమనకు సంబంధి కాదు, వేరే మాటలో చెప్పాలి అంటే, ఆయన సృజింపబడిన వాడు కాదు. ఆయన నిత్యత్వము కలిగి ఆది అంతము లేనివాడు. ఆయన నిత్యత్వం కలిగిన దేవుడు (నిర్గ. 15:18; ద్వితియో 33:27). పరిశుద్ధ గ్రంథ లేఖనము ప్రకారము ఆయన ఆత్మయైయున్నాడు (యోహాను 4:24). ఇప్పటి వరకు ఆయనను ఎవరు చూడలేదు మరియు ఎవరునూ చూడలేరు. దేవుడు ఆత్మ మరియు అదృశ్య స్వరూపి  (కొలొస్సి 1:15; 1తిమోతి 1:17). దేవుడు సర్వవ్యాపి (కీర్తన 139:7-10), సర్వశక్తిమంతుడు (మత్తయి 19:26), సర్వఙ్ఞాని మరియు సర్వవివేచన కలిగిన వాడు (లూకా 12:2).

దేవుడు ఒక్కడే. దానియొక్క అర్థము యెదనగా వేరుపర్చలేని, రెండవదిగా వేరొక్క దేవుడు లేడు. దేవుడు అనువాడు ఒక్కడే (ద్వితియో 4:35). దేవుడు జీవమునిచ్చువాడు (యోబు 33:4). ఆయన తీర్పుతీర్చువాడు మరియు లోకమును పరిపాలించువాడు (కీర్తన 10:26), కడవరి దినమున మనుష్యులకు వారి మాట్లనుబట్టి, వారి ఆలోచనలను బట్టి తీర్పుతీర్చువాడు, దీనినే తీర్పు దినమందురు (1పేతురు 3:7).

ప్రతివాడు, ప్రతిచోట దైవభయము, పాపమునుండి మారుమనస్సు కలిగి, విధేయతతో కూడిన విశ్వాసము కలిగి ఉండవలెనని పరిశుద్ధగ్రంథము ఆజ్యాపిచు చున్నది (ప్రసంగి 12:13; అపో.కా. 17:30).

దేవుడు మన తండ్రియై ఉన్నాడని పరిశుద్ధ లేఖనము చెప్పుచున్నది (మత్తయి 6:9; అపో.కా. 17:29). ఆయన మనలను తన నిత్య ప్రేమతో ప్రేమించుచున్నాడు  (యిర్మియా 31:3). కాబట్టి మనము పాపములలో నశింపోవలెనని ఆయన కోరువాడు కాదు [మన చెడ్డ ఆలోచనలు, పనులు అపరాధితపూరితమైనవి. అయితే దేవుడు మన కొరకు రక్షణ మార్గమును సిద్ధపాటు చేసెను. ఆయనే మన పక్షమున శిక్షను భరించి, మన నిమిత్తము బాధను అనుభవించెను. ఆయన మానవ అవతారిగా అవతరించినపుడు సిలువలో నిత్యబలియాగముగా మూల్యమును మన నిమిత్తము చెల్లించెను. కాబట్టి దేవుడు మాత్రమే మన రక్షకుడై ఉన్నాడు (యూదా 1:25)]. ఎవరైతే తమ హృదయము నందు ఈ సత్యదేవునిని ప్రార్థించెదరో వారి ప్రార్థన వెంటనే ఆయన ద్వారా అంగీకరించబడును, ఎందుకంటే దేవుడు అంతటను మరియు మన శ్వాసను మించిన దగ్గరలో ఉన్నాడు (కీర్తన 34:17; 130:1). "నేను పాపము చేసితిని ప్రభువా, నన్ను క్షమించుము" అని ఎవరైతే చెప్పుదురో దేవుడు వానిని క్షమించును. వాని పాపములు తొలగించబడును. తూర్పు-పడమర ఎలా వేరుగా ఉన్నాయో వాని పాపము ఆ విధముగా వేరుచేయబడును (వేరే మాటలో పూర్తిగా తుడెచివేయబడును (కీర్తన 103:2)), యేసు క్రీస్తు యొక్క బలియాగము ద్వారా ఈ యొక్క క్షమాపణ మరియు నూతన జీవితం మనకు ఆనుగ్రహించబడినది [ఆయన దేవుని వాక్య-స్వరూపియై 2000 సంవత్సరముల క్రితము మానవ అవతారిగా అవతరించెను]. ఈయనే మన పాత లోక పాపమునకును, మరణమునకును ముగింపు. ఆయన మరణము, మూడవ దిన పునరుర్థానము వలన నూతన జీవము కలిగెను.

© డామినిక్ మార్బానియంగ్, 2009

భాషాంతరము: బాలరాజు కే.


Make a Free Website with Yola.