మనుష్యుడు


మనుష్యుడు

దేవుడు మనుష్యున్ని ఆరవదినమున సృజించెను. ఆయన తన స్వరూపమున స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను (కీర్తన 8:5; ఆది 1:28). దేవుడు మానవున్ని వ్యక్తిగాను, శరీరిగాను, ఆత్మనుగాను సృజించెను. కాబట్టి మనుష్యుడు శరీర, ప్రాణ, ఆత్మను కలిగిన వాడు (ఆది 2:7; యోబు 32:8; ప్రసంగి 11:15; 12:7; 1 థెస్సలో 5:23). మొదటి మానవుడయ్న ఆదాము పాపము చేసేను. దీనిని బట్టి మారణములో ప్రవేశించెను(రోమా 5:12). ఆదామునందు అందరు పాపము చేసిరని బోదనైయున్నది. కాబట్టి మరణము అందరికి సంప్రాప్తించెను (రోమా 5:12). ఈ మరణము మూడు స్వభావములను కలిగియున్నది. ఆత్మయ మరణము (దేవుని నుండి వేరుచేయబడుట మరియు దేవునికి శత్రువగుట), భౌతిక మరణము (ఆత్మ శరీరమునుండి వేరుచేయబడుట), రెండవ మరణము (నరకము నందు శిక్ష) (ఎఫెసి 2:1; కొలొస్సి 1:21; రోమా 5:10; ప్రకటన 21:8). పాపములవలన మానవునికి మరణము ప్రాప్తమాయెను.

బైబిలు బోధన ఏమిటంటే “రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరవు, క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు” (1కొరిం 15:50). కాని యేసు క్రీస్తును తన ప్రభువుగా అంగీకరించు వారు రక్శించబడుదురు. రక్షమార్గము ద్వారానే పాత సృష్ఠి శిక్షనుండి తప్పించబడుదురు. ఎందుకనగా యేసుక్రీస్తు ద్వారా రాబోవు దేవుని రాజ్య వారసత్వాన్ని కలిగిరి. మిగతావారు ఈ లోక దేవతకు అనగా దయ్యపు సంబంధితులు (2కొరిం 4:4; ఎఫెసి 2:2; యోహాను 5:19).



© డామినిక్ మార్బానియంగ్, 2009

భాషాంతరము: బాలరాజు కే.


English

हिन्‍दी 

Khasi

 

Make a Free Website with Yola.