సంఘము


సంఘము

యేసు క్రీస్తు యొక్క శిశ్యుల సహవాసమును సంఘమందురు. ఇది గొఱ్ఱె పిల్ల యొక్క వదువుగా(ప్రకట 21:9; ఎఫెసి 5:25-27; ప్రకట 19:7), క్రీస్తు దేహము (1కొరింథి 12:27), దేవుని మందిరము (1పేతురు 2:5,6; ఎఫెసి 2:21-22; 1కొరింథి 3:16-17) పేర్కొనబడినది. సంఘము అపోస్తులుల మరియు ప్రవక్తల పునాదిపై కట్టబడినది. యేసు క్రీస్తే దేనికి మూలరాయి (ఎఫెసి 2:20). కాబట్టి అపోస్తులుల బోధ సంఘ భవిష్యత్తు ఉద్ధారణకైనవి (అపో 2:42; 15:32). సంఘము ప్రియ సహవాస గుంపు. కాబట్టి సమాజముగా కూడుకొనకుండ ఉండరాదని ఆఙాపించబడెను (హెబ్రి 10:25). సంఘము అనునది దేవుని ఇల్లు, ఆయన కుటుంబము; కాబట్టి ఐక్యత, తోడుపాటు, మరియు ప్రోత్సాహనము, విస్తరించునదై యుండవలెను (ఎఫెసి 2:19; 1కొరింథి 1:10; యోహాను 13:35; గలతీ 6:1-2) సంఘము సార్వత్రికము, స్థానికము.

ప్రభువైన యేసు క్రీస్తు అపోస్తులులను, ప్రవక్తలను, సువార్తికులను, భోధకులను మరియు కాపరులను సంఘ సంరక్షణాభివృద్ధికై నియమించెను (ఎఫెసి 4:11-12). పరిశుద్ధాత్ముడు తన వరములను వ్యక్తిగతముగా సంఘాభివృద్ధికై అనుగ్రహించెను (1 కొరింథి 12). సంఘము ప్రతిదేశమునకు యేసు క్రీస్తు సువార్తను అందించుటకు పిలువబడెను, వారెలోనుడి శిష్యులనుగా చేయుటకు మరియు యేసు క్రీస్తు యొక్క భోదలను భోధించుటకు సంఘము పిలువబడెను (మత్తయి 28:19-20). ఈ సుసమావ్హారము నందు ప్రభువు యొక్క పని మరియు వాక్యమును స్థిరపరుచుటకు అద్భుతములను, సూచకక్రియలను జతపర్చెను (మార్కు 16:20; హెబ్రి 2:4).

సంఘమునకు రెండు శాసనములు యివ్వబడెను: నీటి వలన బాప్తిస్మము (మత్త సంఘమునకు రెండు శాసనములు యివ్వబడెను (మత్త 28:19), మరియు ప్రభురాత్రి భోజన సంస్కారం (1 కొరింథి 11:23-29).

యేసు క్రీస్తు తన సంఘము కొరకు తిరిగివచ్చును. అయితే క్రీస్తు నందు నిద్రించినవారు మొదట లేతురు, స్జీవముగా ఉన్నవారు ఆయనతో కూడా మేఘములో యుగముగములు వరకు ఉండుటకు ఎత్తబడుదురు (1థెస్స 4:16-17).


© డామినిక్ మార్బానియంగ్, 2009

భాషాంతరము: బాలరాజు కే.


English

हिन्‍दी 

Khasi

 

Make a Free Website with Yola.