రక్షణ


రక్షణ

యేసు క్రీస్తు నందు విశ్వాసము గలవారు రక్షింపబడుదురని సువార్త ప్రకటించుచుంన్నది. దేవుడు తన కుమారుదయిన యేసు క్రీస్తును ఈలోకమునకు బలియాగపు గొఱ్ఱెపిల్లగా, ఆదిలోక పరిగారార్థముగా పంపెను (యోహాను 1:29). యేసు క్రీస్తు యొక్క దేహము బలియాగపు దేహము. అది పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడినదై ప్రత్యేకింపబడెను (లూకా 1:35; హెబ్రి 10:5). పరిశుద్ధాత్ముడు యేసు క్రీస్తు యొక్క వేదనను బయలుపర్చెను. ఆయన దేహము మన పాపముల నిమిత్తము వేదననొందెను. ఇది పాత నిబంధన ప్రవక్తల ద్వారా వెల్లడి చేయబడెను (1 పేతురు 1:10,11). యేసు క్రీస్తు తన బలియాగపు మరణము ద్వారా మానవునికిని దేవునిమి వధ్య మధ్యవర్తియాయెను. నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించు కొనెను (హెబ్రి 9:14). ఆయన దేవుని సన్నిధానమునకు మార్గము తెరచెను (హెబ్రి 10:19-20). ఆయన బలియాగము మరియు పునరుర్థానము ద్వారా, యేసు క్రీస్తు, దేవునికి మానవునికి సత్-సంబంధమును ఏర్పరచెను (రోమా 5:10; హెబ్రి 1:3).

ఈ ర్క్షణ ఆహ్వానమును ఖాతరు చేయని వారు శిక్షింపబడుదురు. మరియు వారు ప్రభువు సన్నిధి నుండి మరియు ఆయన మహిమగల శక్తి నుండి నిత్యనాశన శిక్షకు పాత్రులగుదురు (2 థెస్స1:9). ఎవరైతే యేసు క్రీస్తును తన రక్షకునిగా అంగీకరించుదురో వారు అంధకారమునుండి తప్పీంచబడి, యేసు క్రీస్తు రాజ్యములో ప్రవేశించుదురు (కొలొస్సి 1:13), వారు పుత్ర వారసత్వము కలిగి యేసు క్రీస్తుతో సహపాలివారగుదురు (యోహాను 1:12; రోమా 8:17).

రక్షణ ఆశీర్వాదములు

  1. పాప క్షమాపణ (ఎఫెసి 1:7)
  2. నీతి మంతులుగా తీర్చబడుదురు (రోమా 4:25)
  3. నిత్య జీవము (యోహాను 3:16)
  4. పరలోక పౌరస్థితి కలిగి యుందురు (ఫిలిప్పి 3:20)
  5. నిత్యమైన స్వాస్థ్యము కలిగి యుందురు (హెబ్రి 9:15)
  6. దయ్యములపై, రోగములపై అధికారమును కలిగియుందురు (లూకా 10:19)
  7. ఆత్మ ఫలములను కలిగియుందురు (గలతీ 5:22-23)
  8. మహిమాన్వితమయిన పునరుర్థానము (1కొరిం 15:51-54)

 

© డామినిక్ మార్బానియంగ్, 2009

భాషాంతరము: బాలరాజు కే.


English

हिन्‍दी 

Khasi

 

Make a Free Website with Yola.