యేసుక్రీస్తు


యేసుక్రీస్తు

యేసుక్రీస్తు దైవకుమారుడై ఉన్నాడని పరిశుద్ధగ్రంథము తెలియచేయుచున్నది (యోహాను 3:16). ఆయనలో, ఆయన ద్వారా దేవుడు మనకు వ్యక్తపరచబడెను (హెబ్రి.1:1,2). ఆయన దేవుని వాద్యమై ఉన్నాడు (యోహాను 1:1). ఆయన అదృశ్యదేవుని స్వరూపి (కొలొస్సి 1:15). ఆయన సృజింపబదిన వాడు కాదు లేదా జన్మించబడినవాడు కాదు; దీనిప్రకారముగా ఆయన "కుమారుడు" కాదు. ఆయన నిత్యత్వము కలిగిన వాడు. ఆయన దేవుడు (యోహాను 1:1). ఈయన మాత్రమే దేవునికిని, మనుష్యునికిని మధ్యవర్తిమై యున్నాడు (1తిమోతి 2:5). మనకు దేవుని గూర్చి ఏదైతే తెలియవలెనో అది క్రీస్తులో మరియు క్రీస్తు ద్వారా మాత్రమే తెలియును, ఎందుకంటే దైవమూర్తిత్వము ఆయన శరీరమందు వ్యక్తమగుచున్నది (కొలోస్సి 2:9). ఆయన సృష్టికర్త, విశ్వపాలకుడు ఎందుకనగా ఆయనలో దైవం వ్యక్తమగుచున్నది (కొలొస్సి 1:16; హెబ్రి 1:3). ఈయన కూడ ఒక దేవుడు కాదు కాని ఈయన మాత్రమే దేవుడు. దేవునితో ఉన్నవాడు (యోహాను 17:22). ఆయనే  త్రిత్వము: తండ్రి దేవుడు, కుమారదేవుడు, మరియు పరిశుద్ధాత్మ దేవుడు.  కాని మూడు దేవుళ్ళు కాదు. ఆయన ఒక్కడే, ముగ్గురూ ఒక్క దేవుడే. అది ఎలాగు అగును? అలాగునే ఎందుకంటే దేవుడు సత్యము, దేవుడు సంతోషము, దేవుడు ప్రేమ. సత్యస్వరూపములో దేవుడు ఎరిగినవాడు, ఙ్ఞానవిషయము, మరియు సర్వఙ్ఞాన ఆత్మ యొక్క ఐక్యతయై యున్నాడు. ప్రేమస్వరూపిగా ఆయన ప్రేమికుడు, ప్రియుడు, మరియు ప్రేమ ఆత్మ. సంతోషముగా, ఆయన సంతోషికుడు, సంతోషవిషయము, మరియు సంతోషాత్మ. యేసు అబ్రహాము కంటే ముందు ఉనికిని కలిగి ఉండెను (యోహాను 8:58). యేసు ఈ విశ్వము కంటే ముందు ఉనికిని  కలిగి ఉండెను (యోహాను 1:1,2). ఆయన [యేసు] నిత్యుడు.

అన్ని క్రీస్తు కొరకు, క్రీస్తుద్వారా చేయబడెను (కొలొస్సి 1:16). ఆయన దేవుని యొక్క ఉన్నతమైనవాడునై, సర్వ సృష్తికి ఆది సంభూతుడై యున్నాడు (కొలొస్సి 1:15).

ఆయన సృష్తికి విడుదల కలుగచేయువాడు, లోక రక్షకుడు ఇందు నిమిత్తమునై ఆయన మానవ అవతరియాయెను (యోహాను 1:14). దేవుని నీతి నెరవేర్చుటకు మన పాపపరిహారార్థమై బాదింపబడెను (హెబ్రి 2:9-18). మరణము నుండి తిరిగిలేచి క్రొత్తసృష్తికి కర్తమాయెను, కాబట్టి ఆయనను ఎవరయితే వెనయ విశ్వాసములతో అంగీకరించుదురో వారు దేవుని రాజ్యములో పాలి భాగస్థులగుదురు. ఆయన తిరిగి వచ్చి చివరిదినమున బ్రతికి ఉన్నవారికి, చనిపోయిన వారికి తప్పక తీర్పు తీర్చును (2తిమోతి 4:1).

© డామినిక్ మార్బానియంగ్, 2009

భాషాంతరము: బాలరాజు కే.


English

हिन्‍दी 

Khasi

 

Make a Free Website with Yola.