దేవదూతలు


 దేవదూతలు

దేవదూతలు అంతంలేని వారు మరియు ఆకాశజీవులు. దేవుడు వీటిని సృష్టించెను (ప్రకట 19:10; 20:8-9; కొలొస్సి 2:18; లూకా 20:34-36). వారు "పరిచారకులు"గా పిలువబడిరి (హెబ్రీ 1:14). వారు లింగ సంబంధులు కారు మరియు అనేకులు (లూకా 20:34-35; దాని 7:10; హెబ్రీ 12:22). విభిన్న రకముల దేవదూతలు కలరు. కెరుబులు ఎదేను తోటలో దేవుని సన్నిధి నందు నియమింపబడిరి (ఆది 3:24; నిర్గమ 25:22; యెహెజే 28:13-14). సిరాపులు "మండుచుండువారు" వీరు దేవునిని ఆరధించువారు (యెషయా 6:2-3). ఇద్దరు ప్రధాన దూతలు మిఖాయేలు - యుద్ధము చేయు దూతలకు అధిపతి (యూదా 1:9; ప్రకటన 12:7), గాబ్రియేలు - వారాహరుడు (లూకా 1:19; దాని 8:16; 9:21). దేవుని సన్నిధిలో వారి స్థానములను బట్టి వారు ఏర్పరచబడిన దేవదూతలని తెలియుచున్నది (1 తిమోతి 5:21). వీరు దేవుని దూతలు, సాతానుతో కలిసి ఎదురుతిరిగిన వారు  కాదు (సాతాను పడిపోవక మునుపు కెరుబుగా అభిషేకించబడిన వాడు). దేవదూతలు ఙ్ఞానము కలిగిన వారు (2స్ముయేలు 14:17; 1పేతురు 1:12). దేవుని ఆఙ్ఞకు లోబడువారు (కీర్త 103:20). వీరు పరిశుద్ధులు (ప్రకటన 14:10). వీరు దేవుని సేవకులు. ఆయన ఆఙ్ఞప్రకారము పరిచర్యచేయు వారు (హెబ్రీ 1:14; కీర్త 103:20). 

© డామినిక్ మార్బానియంగ్, 2009

భాషాంతరము: బాలరాజు కే.


English

हिन्‍दी 

Khasi

 

Make a Free Website with Yola.