సృష్టి


సృష్టి

దేవుడు ఆరు దినములలో విశ్వమంతటిని సృష్టించెనని పరిశుద్ధగ్రంథము మనకు తెలియచేయుచున్నది (ఆది 1,2; నిర్గమా 20:11). దృష్యమైనది కనబడెడు పదార్థములచే నిర్మించబడలేదు (హెబ్రి 11:3); ఇంకో మాటలో చెప్పాలి అంటే శూన్యము నుండి దేవుడు తన అవసరతను బట్టి ఈ విశ్వమును సృష్టించలేదు కాని ఆయన స్వచిత్తమును బట్టి సృష్టించెను (ప్రకటన 4:11). వెలుగును, అంధకారమును దేవుడే కలుగచేసెను (యోష 45:7; ఆది 1:3). స్థలమును, సమయమును దేవుడు కలుగచేసెను (కీర్తన 90:2 "పుట్టించెను" అను దానికి హెబ్రూ పదము హ్యూల్ (chul) అనగ "సృజించెను" లేదా "త్రిప్పెను" ). దేవుడు విశ్వమును యేసుక్రీస్తు కొరకు సృష్టించెను. ఆయన అన్నింటి కంటే ఉన్నతమైనవాడు (కొలొస్సి 1:16-18; ఎఫెసి 1:10).

© డామినిక్ మార్బానియంగ్, 2009

భాషాంతరము: బాలరాజు కే.


English

हिन्‍दी 

Khasi

 

Make a Free Website with Yola.